
బర్డ్ ఫ్లూ వైరస్‌పై అప్రమత్తం
● జిల్లా సరిహద్దులో
కోళ్ల రవాణా వాహనాల తనిఖీ
మర్రిపాడు: బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల్లో అధికారులు శుక్రవారం కోళ్ల లోడుతో వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వైఎస్సార్ జిల్లా ల్యాబ్ ఏడీ, బద్వేల్ ఏడీ నాగభూషణం, మర్రిపాడు మండల పశుసంవర్థక శాఖ సహాయకులు ముజమిల్, రాచాల శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌పై
ఆరోపణలు వస్తే చర్యలు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తే సంబంధిత సెంటర్ బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు హెచ్చరించారు. సాక్షిలో లక్ష్యం ప్రాక్టి‘కిల్’ అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై ఎట్టకేలకు ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు స్పందించారు. శుక్రవారం స్థానిక స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్‌ఐఓ కార్యాలయం నుంచి చీఫ్ సూపరింటెండెంట్లు, అడిషనల్ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లతో పర్చువల్ సమావేశం నిర్వహించారు. ప్రాక్టికల్స్ నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీవీఈఓ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రాక్టికల్స్‌కు 81 మంది గైర్హాజరు
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జిల్లాలో మొత్తం 81 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు 2029 మందికి 2012 మంది హాజరయ్యారు. 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి జరిగిన ప్రాక్టికల్స్‌కు 2061 మందికి 1997 మంది హాజరయ్యారు. 64 మంది గైర్హాజరయ్యారు.
పరిశోధనల్లో
నెల్లూరుకు ప్రత్యేక స్థానం
● వ్యవసాయంలో నూతన పద్ధతులు
● కిసాన్ మేళాలో శాస్త్రవేత్తలు
నెల్లూరు (సెంట్రల్): వరి విత్తనాల పరిశోధనలకు సంబంధించి నెల్లూరుకు ప్రత్యేక స్థానం ఉందని లాంఫాం యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు శివన్నారాయణ అన్నారు. నెల్లూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం కిసాన్ మేళా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు పరిశోధన స్థానం నుంచి వరి వంగడాలపై కొత్తగా పలు పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. లాంఫాం పరిశోధనా సంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ 1937లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో స్థాపించిన ఈ పరిశోధన స్థానం 1961 నుంచి నెల్లూరులో ఏర్పా టు చేసినట్లు గుర్తుచేశారు. ఇక్కడి అనేక పరిశోధనలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సుమతి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభదాయక నూతన పద్ధతులు అనుసరణీయం అన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి సత్యవాణి మాట్లా డుతూ ఎప్పటికప్పుడు మండలాల్లోని వ్యవసా య అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందిస్తున్నారని, శాస్త్రవేత్తలు సూచనలు తీసుకుంటే మంచిదన్నారు. ప్రధాన శాస్త్రవేత్త వినీత, కృషి విజ్ఞాన కో–ఆర్డినేటర్ లలితా శివజ్యోతి మాట్లాడారు.
మద్దతు ధరలు కల్పిస్తే చాలు
రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కిసాన్‌మేళాకు వచ్చిన పలువురు రైతులు అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు. తమకు మద్దతు ధర ఎంతో అవసరమని, ఆ ధరే లేనప్పుడు ఈ సభలు, సమావేశాలు ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వాన్ని పొగడడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో రైతులు లేచి వెళ్లిపోయారు.

బర్డ్ ఫ్లూ వైరస్‌పై అప్రమత్తం

బర్డ్ ఫ్లూ వైరస్‌పై అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment