
వైద్యమిత్రలపై కూటమి కత్తి
సీతారామపురం: ఆరోగ్యశ్రీ పథకాన్ని (ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్) రోగులకు అందించడంలో కీలకభూమి పోషించే వైద్యమిత్రలకు భరోసా కరువైంది. ఆరోగ్యశ్రీని బీమా కంపెనీకి అప్పగిస్తారన్న ప్రకటన వైద్యమిత్రులను ఆవేదనకు గురి చేస్తోంది. 17 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని నేడు ఆధారం కోల్పోతామేమోనన్న భయం వెంటాడుతోంది.
120 మంది
జిల్లాలోని 132 పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, డి
స్ట్రిక్, జీజీహెచ్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. వాటిలో 35 ప్రైవేట్, 31 డెంటల్ (ప్రైవేట్), 66 ప్రభుత్వాస్పత్రులున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణకు ఎనిమిది మంది టీం లీడర్లు, ఆఫీస్ అసోసియేట్ ఒకరు, డీఎల్ ఒకరు, జిల్లా మేనేజర్ ఒకరుండగా 120 మంది వైద్యమిత్రలు పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.15 వేల జీతాన్ని నిర్ధారించగా కటింగ్‌లు పోను రూ.13 వేలు చేతికందుతుంది. వైద్యమిత్రులంతా ఉన్నత చదువు లు చదివిన వారే. ఎప్పటికై నా తమకు గుర్తింపు, కనీస వేతనం అందుతుందని, ఉద్యోగభద్రత ఉంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో జీతాలివ్వడం ప్రారంభించినప్పటి నుంచి వారి కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తున్న పరిస్థితి నెలకొంది.
ప్రధాన భూమిక
నెట్వర్క్ ఆస్పత్రుల్లో నెలకు రెండు వేలకు పైబడి శస్త్రచికిత్సలు జరుగుతున్నట్టు అంచనా. రోగులు హాస్పిటల్లో చేరినప్పటి నుంచి తిరిగి క్షేమంగా ఇంటికెళ్లే వరకు నిరంతరం వైద్యమిత్రలు పర్యవేక్షిస్తుంటారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటంతో వైద్యమిత్రలంతా ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుతారా? లేక ప్రైవేట్‌కు అప్పగిస్తారా? అనే మీ మాంస వారిని వెంటాడుతోంది. ప్రైవేట్‌కు అప్పగిస్తే ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న సర్వీస్ మొత్తం ఎందుకు పనికిరాకుండా పోతుందనే ఆవేదనలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. దీనికితోడు ఉద్యోగాలు కొనసాగిస్తారా? లేక కొత్తవారిని తీసుకుంటారా అనే భయంలో ఉన్నారు.
ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు
అప్పగించే యత్నం
ఉద్యోగభద్రతపై ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment