
వెటర్నరీ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ
రాపూరు: విజయనగరం జిల్లా గడివిడిలో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరిగిన 12వ రాష్ట్ర స్థాయి అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీల్లో రాపూరు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రిన్సిపల్ శ్రీహరి తెలిపారు. వారిని శనివారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ క్రికెట్ బాలుర విభాగం, బాలికల డిస్కస్ త్రోలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బాలుర కబడ్డీ, బాలికల క్యారమ్స్, బాలికల షాట్‌పుట్, బాలుర డిస్కస్‌త్రో, 200 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ స్థానం సాధించినట్లు వివరించారు. విద్యార్థులు బహుమతులు సాధించేందుకు కృషి చేసిన వ్యాయామ అధ్యాపకుడు పెంచలయ్యను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విశాలి, శివ, చంద్రశేఖర్, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment