
అంతర్జాతీయ పోటీలకు కావలి విద్యార్థినులు
కావలి: కావలి రూరల్ మండలం కొత్తసత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు వి.షాలిని, వై.జ్యోతిలు అంతర్జాతీయ జంప్‌రోప్ పోటీలకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొన్నారు. షాలిని రెండో స్థానంలో, జ్యోతి మూడో స్థానంలో నిలిచారు. దీంతో వారు శ్రీలంకలో జరుగనున్న అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు. విద్యార్థినులను హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, పీడీ మురళి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు
148 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్‌కు శనివారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 148 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు 2,874 మందికి 2,803 మంది హాజరయ్యారు. 71 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి జరిగిన ప్రాక్టికల్స్‌కు 2,148 మందికి 2,071 మంది హాజరయ్యారు. 77 మంది గైర్హాజరయ్యారు.
కండలేరులో
53.270 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 53.270 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 720, లో లెవల్ కాలువకు 150, హైలెవల్ కాలువకు 190, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment