పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
● స్వచ్ఛఆంధ్ర, స్వచ్ఛదివస్‌ను ప్రారంభించిన ఆనం
ఆత్మకూరు: పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూరు ఆర్డీఓ బి.పావని, మున్సిపల్ కమిషనర్ సి.గంగాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ వద్ద శనివారం మంత్రి ప్రారంభించారు. మున్సిపల్ సిబ్బంది తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని ప్రదర్శించారు. అనంతరం మంత్రి ఆనం, అధికారులు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞను నిర్వహించారు. అక్కడి నుంచి తూర్పువీధిలో అలఘనాథస్వామి ఆలయం వరకు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌పై అవగాహన కల్పిస్తూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అలఘనాథస్వామి ఆలయానికి సంబంధించి కల్యాణ మండపం అభివృద్ధికి రూ.53.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు ఆరోగ్య శాఖా మంత్రి సత్యప్రసాద్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఆత్మకూరు–సోమశిల మార్గాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధిత ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ నిధులు మంజూరు చేస్తారన్నారు. బీసీ హాస్టళ్ల భవనాల పునఃనిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు మంజూరైనట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలో పలు విద్యుత్ లైన్ల మార్పు, ఆ శాఖ భవనాల నిర్మాణానికి రూ.85 కోట్లు మంజూరైనట్లు వివరించారు. అనంతరం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చెరువు ఎదురుగా మొక్కలు నాటారు. బైపాస్‌రోడ్డులోని ఏపీ బాలికల గురుకుల రెసిడెన్సియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ ఆర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ జి వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్ షేక్ సర్దార్, కౌన్సిలర్లు, రవాణా శాఖ ఎంవీఐ ఎం రాములు, ఫారెస్ట్ రేంజర్ శేఖర్, డీఆర్‌ఓ పిచ్చిరెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment