ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్
● ఇద్దరికి గాయాలు
పొదలకూరు: ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన పట్టణానికి సమీపంలోని రాపూరు మార్గంలో చైతన్య స్కూల్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. మర్రిపాడు మండలం పల్లవోలుకు చెందిన ముగ్గురు యువకులు సైదాపురం మండలం కలిచేడుకు వెళ్లారు. తిరిగొస్తుండగా, పొదలకూరు నుంచి రాపూ రుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొంది. ఘటనలో ఇండ్ల పుల్లయ్య, రాగి వెంకయ్య గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో చోరీపై ఫిర్యాదు
వెంకటాచలం: మండలంలోని గొలగమూడిలో ఆటో చోరీపై పోలీసులకు బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేశారు. వెంకటాచలానికి చెందిన మేకల గోవింద్, కుటుంబసభ్యులతో కలిసి గొలగమూడిలోని భగవాన్ వెంకయ్యస్వామి ఆశ్రమానికి తన ఆటోలో శనివారం వెళ్లారు. ఆశ్రమం వద్ద పార్కింగ్ స్టాండ్‌లో ఆటోను నిలిపారు. అనంతరం వచ్చేసరికి కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శుల
సంఘ అధ్యక్షుడిగా శ్రీధర్
నెల్లూరు సిటీ: పంచాయతీ కార్యదర్శుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా శ్రీధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ జనరల్ సెక్రటరీగా ముషీధర్, ఉపాధ్యక్షులుగా పద్మజ, కోశాధికారిగా దుర్గా దొరబాబు ఎన్నికయ్యారు. సమస్యలపై రాష్ట్ర కార్యవర్గానికి తెలియజేసి పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
నెల్లూరు(అర్బన్): అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్, ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. నగరానికి ఆదివారం వచ్చిన వీరు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను కలిసి ఉద్యోగ భద్రత కోసం చేపట్టాల్సిన ఉద్యమాలపై చర్చించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆప్కాస్ విధా నాన్ని నేటి ప్రభుత్వ పెద్దలు రద్దు చేస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఇలా అయితే మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి చిరుద్యోగులు బలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సొసైటీల కింద పనిచేస్తున్న మెప్మా, సెర్ఫ్ సిబ్బందికి హెచ్‌ఆర్ పాలసీని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించారని గుర్తుచేశారు. ఆప్కాస్‌పై ఏర్పడిన అనిశ్చితిని తొలగించాలని కోరారు. సంఘ జిల్లా అధ్యక్షుడు మహిధర్‌బాబు, జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కోశాధికారి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
హ్యాండ్‌బాల్
జిల్లా జట్టు ఎంపిక
చిల్లకూరు: రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న హ్యాండ్‌బాల్ పోటీలకు 16 మంది క్రీడాకారులతో ఉమ్మడి నెల్లూరు జిల్లా జట్టును ఎంపిక చేశామని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి, గురుకుల పాఠశాల పీడీ శ్రీరేష్ తెలిపారు. చిల్లకూరులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో జట్లను ఆదివారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్నూల్లోని క్రీడా మైదానంలో ఈ నెల 21 నుంచి 23 వరకు పోటీలను నిర్వహించనున్నారని చెప్పారు. పీడీ హేమంత్, పీఈటీ అఖిల్‌తేజ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్
ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్
Comments
Please login to add a commentAdd a comment