నెల్లూరు(టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్ కు సోమవారం 143 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం ప్రాక్టికల్స్‌కు 2,685 మందికి 73 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2,2 16 మందికి 70 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ శ్రీనివాసు లు కేంద్రాలను తనిఖీ చేశారు.
నేటి నుంచి భాషోత్సవాలు
నెల్లూరు (టౌన్): జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మంగళవారం నుంచి భాషోత్సవాలను నిర్వహించాలని డీఈఓ ఆర్.బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న ఇంగ్లిష్, 19న సంస్కృతం, హిందీ, ఉర్దూ, 20న గిరిజన భాష, కన్నడ, తమిళం, ఒరియా 21న తెలుగు భాషకు సంబంధించి ఉత్సవాలను జరపాలని చెప్పారు. ఇందు కోసం ఒక్కో పాఠశాలకు రూ.500 నిధులు కేటాయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment