వెల్లువెత్తుతున్న వినతులు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 472 అర్జీలు
నెల్లూరురూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ కార్యక్రమానికి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు, పరిపాలన తీరుఎలా ఉందో ఈ వినతులే అద్దం పడుతున్నాయి. వారం వారం వచ్చే అర్జీల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం వరకు 400 వస్తున్న అర్జీలు ఈ వారం 472కు చేరాయి. కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్‌తోపాటు డీఆర్‌ఓ ఉదయభాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, డీపీఓ శ్రీధర్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయొద్దు
విద్యార్థులను మార్కుల కోసం పాఠశాలల యాజమాన్యాలు మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నగర విద్యార్థి నాయకుడు తిరకాల శేషసాయి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, అప్రోజ్, జస్వంత్, సాయి పాల్గొన్నారు.
స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు...
ఆరు నెలల నుంచి పలు జిల్లాల్లో గిరిజనులపై జరుగుతున్న దాడులపై అనేక సార్లు సంబంఽధిత పోలీస్‌శాఖ వారికి గ్రీవెన్స్ సందర్భంగా వినతిపత్రాలు సమర్పిస్తే వాళ్లు స్థానిక ఎస్‌హెచ్‌ఓలకు పంపుతున్నారని, వారు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్లను స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు రాగి పోలమ్మ, హైమావతి, సింహాద్రి, మాధవి, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, వక్ఫ్ జేపీసీ రిపోర్టు, ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కి వందల కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాక్రాంతం చేసి ముస్లిం సమాజానికి అన్యాయం చేసే కుట్రలను తీవ్రంగా విభేదిస్తున్నామని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలంటూ నేషనల్ మైనార్టీ సెల్ నాయకులు ర్యాలీగా వచ్చి వినతిపత్రం సమర్పించారు. ప్రతిపక్షాలు చెబుతున్న సవరణలను స్వీకరించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో మరింత తీవ్రతరం చేస్తామన్నారు.
వెల్లువెత్తుతున్న వినతులు
Comments
Please login to add a commentAdd a comment