21న మామిడి సాగుపై క్రాప్ సెమినార్
నెల్లూరు(సెంట్రల్): ఈ నెల 21న మామిడి పంటపై జిల్లా స్థాయి క్రాప్ సెమినార్ కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలువురు శాస్త్రవేత్తలు మామిడి పంటలో తెగుళ్ల నివారణ, సాగులో పలు సూచనలు ఇస్తారన్నారు. మామిడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
అక్రమ మైనింగ్‌పై
కేసు నమోదు
పొదలకూరు: మండలంలోని తాటిపర్తి పంచాయతీలో 2023లో అక్రమంగా మైనింగ్‌కు పాల్పడ్డారని మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్సై ఎస్‌కే హనీఫ్ కథనం మేరకు వివరాలు.. పేర్నేటి శ్యాంప్రసాద్, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి అక్రమంగా మైనింగ్ చేసి తెల్లరాయిను తరలించారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు
వేటకెళ్లి మత్స్యకారుడి మృతి
తోటపల్లిగూడూరు: వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు మృతి చెందా డు. ఈ ఘటన సోమ వారం వెలుగు చూ సింది. ఎస్సై వీరేంద్రబాబు సమాచారం మేరకు.. వెంకన్నపాళెంపట్టపుపాళెం గ్రామానికి చెందిన కొండూరు వెంకటేశ్వర్లు (51) సముద్రంలో వేటపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం వెంకన్నపాళెం పట్టపుపాళెం సమీపంలోని సముద్రతీరం గుండా ఇంజిన్ బోటుపై వేటకు బయల్దేరాడు. సోమవా రం ఉదయానికి కూడా వెంకటేశ్వర్లు తీరానికి చేరుకోకపోవడంతో తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇందుకూరుపేట మండలం కొరుటూరు సమీపంలోని తీరంలో వెంకటేశ్వర్లు మృతదేహం బయటకు కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు వెంకటేశ్వర్లకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment