మోడల్ స్కూల్‌కు సంబంధించిన మైదానాన్ని ఆనుకుని నారాయణ స్కూల్ ఉంది. ఇక్కడ చదివే పిల్లలు ఆడుకునేందుకు స్థలం లేదు. ఈ నేపథ్యంలో సదరు యాజమాన్యం కన్ను మోడల్ స్కూల్ మైదానంపై పడింది. నారాయణ పాఠశాల వెనుక వైపు నుంచి మైదానంలోకి వెళ్లేందుకు సొంతంగా దారిని ఏర్పాటు చేశారు. మెట్లు కూడా నిర్మించారు. మోడల్ స్కూల్ పిల్లలు మైదానంలోకి వెళ్లేందుకు గతంలోనే దారి ఉంది. దీనిని పట్టించుకోని నారాయణ యాజమాన్యం వారి పిల్లల కోసం దారి ఏర్పాటు చేయడం, స్టేజీ చర్చనీయాంశంగా మారింది. వారి స్కూల్‌కు సంబంధించిన పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు అన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. మైదానం లేకుండానే నారాయణ యాజమాన్యాం పాఠశాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కూల్‌కు స్థలాన్ని యథేచ్ఛగా వినియోగించడంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment