
విన్నవించినా.. స్పందన లేదు
● అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలి
● సంబంధిత అసోసియేషన్,
సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
● టీడీపీ నాయకుల ఓవరాక్షన్
వరికుంటపాడు: అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని సీపీఐ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావులు మండలంలోని కనియంపాడు సమీపంలో అక్రమంగా నరికివేసిన జామాయిల్ తోటలను మంగళవారం పరిశీలించారు. కొంతసేపు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ల వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వరికుంటపాడు మండలంలో భాస్కరాపురం, కనియంపాడు గ్రామాల సమీపంలో 150 ఎకరాల్లో జామాయిల్ సాగు ఉందన్నారు. ఆ చెట్లను సుమారు రెండు నెలల నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమార్కులు నరికివేసి రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ఇటీవల తహసీల్దార్‌కు విన్నవించామన్నారు. అయినా స్పందన లేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ కర్రను తరలింపు వెనుక బడా నాయకుల హస్తం ఉందని తెలుస్తోందన్నారు. తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడే ప్రసక్తే లేదని, ఆందోళనలను కొనసాగిస్తామన్నారు. ఈ అంశాన్ని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరుతామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లగా అక్కడ అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
తీవ్ర వాగ్వాదం
నిరసన కార్యక్రమాల అనంతరం నేతలు తిరుగు ప్ర యాణమయ్యారు. వరికుంటపాడు సమీపంలో జా మాయిల్ లోడుతో ట్రాక్టర్ వెళ్తుండగా అడ్డుకుని ప్ర శ్నించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నా యకులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శంకరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment