
భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు
● డీఎంహెచ్‌ఓ సుజాత
నెల్లూరు(అర్బన్): భ్రూణ హత్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ సుజాత తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ నిఽషేధ చట్టం అమలుపై నెల్లూరు సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి కమిటీ సభ్యులకు, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలకు, మెడికల్ అసోసియేషన్ల నేతలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లపై దాడులను విస్తృతం చేస్తామన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ చేసినట్టు తెలిస్తే ఆ సెంటర్లను సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్కానింగ్ చేసేవారు ప్రతి గర్భిణి వివరాలను ఆన్‌లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. అల్ట్రా సౌండ్, ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, ఎకో, బీ–స్కాన్ నిర్వాహకులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, డీఐఓ డా.ఉమామహేశ్వరి, కమిటీ సభ్యులు పీడియాట్రిషియన్ డా.సర్ధార్ సుల్తానా, గైనకాలజిస్ట్ డా సీహెచ్ కిరణ్, డివిజనల్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డా.దయాకర్, డీఎస్పీ రామారావు, డా.బ్రిజిత, డా.శోభారాణి, డెమో అధికారి కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment