
విలీన ప్రక్రియను ఆపాలంటూ..
నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని పెద్దచెరుకూరులో ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల విద్యార్థులను 1.2 కిమీటర్ల దూరంలో ఉండే మరో స్కూల్లో విలీనం చేసే ప్రక్రియను విరమించుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మంగళవారం స్కూల్ ఎదుట పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎస్టీ వర్గానికి చెందిన వారిమని, ఎక్కువ మందిమి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. విలీనం చేస్తే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు బడి మానేస్తారని తెలిపారు. బేసిక్ ప్రైమరీ స్కూల్‌గానే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ బి.శారద, వెంకటరమణమ్మ, పద్మప్రియ, హర్షిణి, చెంచులక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment