● నిందితులపై కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): ఆయుర్వేద మందులు వాడితే చెవుడు పోతుందని ఓ వృద్ధుడిని నమ్మించి రూ.లక్షలు కాజేసిన నిందితులపై నెల్లూరు సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. గుప్తా పార్క్ సెంటర్‌కు చెందిన ఓ వృద్ధుడు స్థానికంగా చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయనకు చెవుడు ఉంది. ఈక్రమంలో కృష్ణ అనే వ్యక్తి పరిచయమై తన తండ్రికి సైతం చెవుడు ఉందన్నాడు. ఓ ఆయుర్వేద కంపెనీకి చెందిన మందులు వాడటం ద్వారా చెవుడు పోయిందని నమ్మబలికాడు. అయితే ఆ మందులు చాలా ఖరీదైనవని కొంతకాలం క్రమం తప్పకుండా వాడాలని చెప్పాడు. దీంతో వృద్ధుడు అతడికి రూ.95 వేలను ఫోన్‌పే ద్వారా వేశాడు. ఈక్రమంలోనే విజయ్ అనే వ్యక్తిని తన అన్న అంటూ కృష్ణ వృద్ధుడికి పరిచయం చేశాడు. విజయ్ కొన్ని ఆకులు, లేహ్యం ఇచ్చి వాటిని రోజూ వాడాలన్నాడు. వృద్ధుడు కొద్దిరోజులు వాడగా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో వారిని ప్రశ్నించాడు. ఇంకొన్ని మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పారు. ఇటీవల వృద్ధుడిని శోధన్‌నగర్‌లోని ఓ ఆయుర్వేద దుకాణం వద్దకు తీసుకెళ్లి రూ.4.25 లక్షలు తీసుకుని కొన్ని మందులను ఇప్పించారు. వాటిని ఎలా వినియోగించాలో ఇంటి వద్దకు వచ్చి చెబుతామని కృష్ణ, విజయ్‌లు వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన వృద్ధుడు వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. షాపు వద్దకు వెళ్లి చూడగా మూసివేసి ఉండటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సంతపేట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment