
సిమెంట్ బ్రిక్స్ తరలిస్తుండగా అడ్డగింత
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పక్కాగృహం నిర్మాణానికి సంబంధించిన సిమెంట్ బ్రిక్స్‌ను ఓ కాంట్రాక్టర్ తరలిస్తుండగా ప్రజలు అడ్డుకున్న ఘటన మంగళవారం జరిగింది. నెల్లూరు 54వ డివిజన్ భగత్‌సింగ్ కాలనీలో గత ప్రభుత్వంలో లేఅవుట్ వేశారు. కొన్ని ఇళ్లు నిర్మించగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో నరాల సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్ సగం నిర్మించిన ఓ ఇంటిని పగులకొట్టి సిమెంట్ బ్రిక్స్‌ను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా స్థాని కులు అడ్డుకున్నారు. ఈ విష యమై హౌసింగ్ ఈఈ మోహన్‌రావు మాట్లాడుతూ సదరు కాంట్రాక్టర్ సిమెంట్ బ్రిక్స్‌ను అక్రమంగా ట్రాక్టర్‌లో తరలిస్తున్నట్టు స్థానికులు తనకు సమాచారం ఇచ్చారన్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment