
వ్యక్తిపై హత్యాయత్నం
నెల్లూరు(క్రైమ్): పాతకక్షలను మనస్సులో పెట్టుకొని వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని గంటల వ్యవధిలోనే నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. రాయపుపాళెంలో చికెన్ పకోడా దుకాణాన్ని నిర్వహిస్తున్న ఏసీనగర్‌కు చెందిన పఠాన్ మౌలాలీ వద్దకు అదే ప్రాంతానికి చెందిన గంగాధర్ 20 రోజుల క్రితం వెళ్లారు. చికెన్ పకోడా ఇవ్వాలని కోరగా, అందజేయడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి గురైన గంగాధర్.. దుకాణంలో ఉన్న చికెన్ పకోడాను కిందపడేశారు. దీంతో వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాయపుపాళెం – రామచంద్రాపురం జంక్షన్లో గంగాధర్‌పై మౌలాలీ కత్తితో మంగళవారం రాత్రి దాడి చేసి గాయపర్చారు. ఈ మేరకు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం ఎస్సై రెహమాన్ గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంతినగర్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు.
షార్ట్ సర్క్యూట్‌తో
అగ్నిప్రమాదం
కావలి: పట్టణంలోని ముసునూరులో గల ఓ ఇంట్లో ఏసీ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం మంగళవారం రాత్రి సంభవించింది. దీంతో భయాందోళనలకు గురైన కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. మంటలతో ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పింది. 15 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.ఐదు లక్షల నగదు కాలిబూడిదైందని బాధితుడు నరసయ్య వాపోయారు. బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.
ఉపాధి హామీ వ్యవస్థను
దెబ్బతీయొద్దు
నెల్లూరు (పొగతోట): క్షేత్రస్థాయిలో వివిధ రకాల ఒత్తిళ్లు, బెదిరింపులు ఉండొచ్చని, దీనికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వ్యవస్థను దెబ్బతీయొద్దని డ్వామా పీడీ గంగాభవాని పేర్కొన్నారు. నగరంలోని డ్వామా కార్యాలయంలో క్లస్టర్ ఏపీడీలు, ఏపీఓలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒత్తిళ్లను అధిగమించి పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అందరూ అనుభవమున్న అధికారులేనని, సమస్యలను అధిగమించి పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలని పేర్కొన్నారు. పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను లక్షకు పెంచాలని ఆదేశించారు.
ఆర్బీకేలో జేసీ పరిశీలన
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని రేబాలలో గల రైతు భరోసా కేంద్రాన్ని జేసీ కార్తీక్ బుధవారం పరిశీలించారు. పరికరాలను పరిశీలించి రైతులతో ముచ్చటించి వారి సమస్యలను ఆరాతీశారు. ధాన్యం మద్దతు ధరతో పాటు తేమ శాతంలో సడలింపులిచ్చి గోడౌన్లను ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. రైతులు తెలియజేసిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పాతకక్షలతో
మహిళ ఇంటికి నిప్పు
పొదలకూరు: పాతకక్షలను దృష్టిలో ఉంచుకొని పూరింటికి ఓ వ్యక్తి నిప్పుపెట్టిన ఘటన మండలంలోని బిరదవోలులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలో పూరింట్లో నివాసం ఉంటున్న కై తేపల్లి లక్ష్మమ్మకు అదే గ్రామానికి చెందిన రంగయ్య కుటుంబానికి మధ్య విభేదాలున్నాయి. ఈ తరుణంలో ల క్ష్మ మ్మ తన కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండ గా, రంగయ్య నిప్పు పెట్టారు. మంటలు వ్యా పించడంతో లక్ష్మమ్మ, ఆమె కుమార్తె బయటకు పరుగులు తీశారు. గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
పెన్షనర్ల సర్వసభ్య
సమావేశం నేడు
నెల్లూరు(అర్బన్): పురమందిర ప్రాంగణంలోని వర్ధమాన సమాజ మందిరంలో ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నామని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, వెంకయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షనర్ల పెండింగ్ సమస్యలు, డీఆర్ బకాయిలు తదితరాలపై చర్చించనున్నామని, సభ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

వ్యక్తిపై హత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment