
మితిమీరుతున్న టీడీపీ దౌర్జన్యాలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు మితిమీరిపోయాయనే విషయాన్ని ఎక్కడికెళ్లినా ప్రజలు తెలియజేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల వద్ద పొలాలను కొనుగోలు చేసి జగనన్న కాలనీలను నిర్మిస్తే, టీడీపీ మూకలు దౌర్జన్యం చేసి ఆక్రమిస్తున్నారని బాధితులు వాపోతున్నారని తెలిపారు. ఆక్రమించిన వారు ఇల్లు కట్టుకున్నా, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అసలైన లబ్ధిదారులకు అప్పగిస్తామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించడంలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఎదురయ్యే ప్రతి సమస్యపై పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి ప్రజలకు అండగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పేదలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఘన నివాళి
కల్యాణపురానికి చెందిన పార్టీ నేత లక్ష్మణరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. పట్టణంలోని యాదవవీధికి చెందిన నాయీబ్రాహ్మణ సేవా సంఘ నాయకుడు బెల్లకొండ కాళిదాస్ తల్లి ఇటీవల మృతి చెందడంతో పరామర్శించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు నరసాపురం సుబ్బయ్య ఇటీవల మృతి చెందడంతో నివా ళులర్పించారు. బిరదవోలు ఎంపీటీసీ రావుల దశరథరామయ్యగౌడ్, వెన్నపూస దయాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, యనాదిరెడ్డి, ఆకుల గంగిరెడ్డి, మాలపాటి రమణారెడ్డి, లక్ష్మయ్య, మద్ది రెడ్డి రమణారెడ్డి, బెల్లంకొండ ప్రసాద్, తుమ్మ ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment