
నూతన సాంకేతికతను ప్రోత్సహించాలి
మాట్లాడుతున్న సునీత
వెంకటాచలం: ఆర్థిక స్థిరత్వం, గ్రామీణ స్వయంప్రతిపత్తి కోసం నూతన సాంకేతికతలు, వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు కోరారు. సుస్థిర జీవనోపాధులవైపు నూతన మార్గదర్శనలు, గ్రామీణ వృత్తుల విభజన అనే అంశంపై కాకుటూరు సమీపంలోని వర్సిటీలో జాతీయ సదస్సును బుధవారం నిర్వహించారు. గూగుల్ మీట్ ద్వారా వర్చువల్ విధానంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి రిజిస్ట్రార్ సునీత మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి కోసం కొత్త అవకాశాలను గుర్తించి, వాటి అమలు దిశగా ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా మారనుందని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఆంకాలజీ ప్రొఫెసర్ రఘునాథరావు, డాక్టర్ మహేష్ పవన్, వీఎస్‌యూ ప్రిన్సిపల్ విజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment