కోలాహలం.. ఛత్రపతి జయంత్యుత్సవం
నెల్లూరు (బృందావనం): దేశభక్తిని చాటుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నగరంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవ ర్యాలీ బుధవారం కోలాహలంగా సాగింది. శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 496వ జయంతిని పురస్కరించుకుని హిందూ ధార్మిక సంస్థలు, పార్టీలకతీతంగా పలువురు పాల్గొన్నారు. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న శివాజీ జయంతి వేడుకలకు ప్రజలు భారీగా తరలిరావడంతో నగరంలో కోలాహల వాతావరణం కనిపించింది. వక్తలు మాట్లాడుతూ భరతమాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ అని, దేశానికి ఆయన వరమని, ఆయన త్యాగనిరతిని దేశం ఎన్నటికీ మరువదన్నారు. యువత ఛత్రపతి భావజాలాన్ని, శౌర్యాన్ని నింపుకుని ముందుకు సాగితే దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు. యువతకు ఛత్రపతి మార్గదర్శకుడన్నారు. దేశం కోసం, హైందవ ధర్మం కోసం శివాజీ మహరాజ్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
కోలాహలంగా ప్రదర్శన
ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కాకు మురళీరెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంత్యుత్సవ ర్యాలీ స్థానిక మద్రాస్ బస్టాండ్ దగ్గర ఉన్న వైఎంసీఏ మైదానం నుంచి బయలుదేరి వీఆర్సీ, గాంధీబొమ్మ, శివాజీ సెంటర్, ఏసీ సెంటర్, నర్తకి సెంటర్, కనకమహల్, కొత్తహాల్ సెంటర్, సండే మార్కెట్ సెంటర్ మీదుగా వైఎంసీఏ మైదానానికి చేరింది. అశ్వంపై అధిరోహించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కోలాహలం.. ఛత్రపతి జయంత్యుత్సవం
కోలాహలం.. ఛత్రపతి జయంత్యుత్సవం
Comments
Please login to add a commentAdd a comment