ఉపాధి పథకం అధికారులకు ప్రజాప్రతినిధి ఆదేశాలు
ఉపాధి హామీ పథకం ‘పచ్చ’ మయం
ఉపాధి హామీ పథకం అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారిపోయింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనులు జరుగుతున్నాయి. ఆ పార్టీ కార్యకర్తలే మేట్లు, ఫీల్డ్ అసిసెంట్లుగా వ్యవహరిస్తున్నారు. కూలీల కడుపులు కొట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. వీరి అక్రమాలకు అడ్డుగా ఉన్నారని, తమకు అనుకూలంగా లేని ఫీల్డ్ అసిసెంట్లను తొలగించి టీడీపీ కార్యకర్తలను పెట్టి పనులు జరుపుకుంటున్నారు. తమ ఉద్యోగాలు తమకు కావాలని పోరాడుతున్న వారిపై కేసులు పెట్టమని, భారీగా రికవరీలు చేయమని సిఫార్సులు చేస్తూ మరింతగా వేధిస్తున్నారు. ఈ రకంగా వేధింపులు బెదిరింపుల్లో కావలి ప్రజాప్రతినిధి ప్రథమ స్థానంలో ఉన్నారని జిల్లా ఉపాధి హామీ కార్యాలయంలో చర్చ నడుస్తోంది. ‘నేను చెప్పినట్లు చేస్తారా.. మిమ్మల్ని ఊడగొట్టించమంటారా? అంటూ తమనే బెదిరిస్తూ, ఒత్తిడి పెంచుతున్నట్లు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment