జీబీఎస్ కలకలం
● అరవపాళెంలోముమ్మరంగా
పారిశుధ్య పనులు
సంగం: మండలంలోని అరవపాళెంలో గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జీబీఎస్ లక్షణాలతో మంగళవారం నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. అతనికి అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ సర్పంచ్, అధికారులు అరవపాళెంతోపాటు పుట్టువారిగుంట గ్రామాల్లో బుధవారం ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే, శానిటేషన్, వాటర్ ట్యాంక్ క్లోరినేషన్, వాటర్ టెస్టింగ్‌లను నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాసులరెడ్డి ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించారు. జ్వరం, దగ్గు, వాంతులు, విరోచనాలు, జలుబు ఈ వ్యాధి లక్షణాలని, వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత తిమ్ముర్లు, నరాల బలహీనత, కండరాల నొప్పులు వస్తాయన్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రాణాపాయం ఉంటుందని, ఈ వ్యాధి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని డాక్టర్ అశోక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment