టీడీపీ నేత ఆధ్వర్యంలో పేకాట శిబిరం
నెల్లూరు టాస్క్‌ఫోర్స్: కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండల స్థాయి టీడీపీ నేత పేకాట శిబిరం నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ నేతలు మద్యం తాగుతూ పేకాట ఆడుతున్న వీడియో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. నార్తురాజుపాళేనికి చెందిన టీడీపీ నేత జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనధికార పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నాడు. జిల్లా నలుమూలల నుంచి జూదరులు వచ్చి అక్కడ మూడు ముక్కలాడుతున్నారు. నిత్యం రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేత రెండేళ్ల క్రితం అనధికార పేకాట శిబిరం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా మార్పురాలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ యథేచ్ఛగా పేకాట శిబిరం నిర్వహిస్తూ ఆదాయ వనరులుగా మార్చుకున్నాడు.
రోజూ ప్లేస్‌లు మార్చేస్తూ..
ఈజీ మనీకి అలవాటు పడిన సదరు టీడీపీ నేత నియోజకవర్గంలోని కొడవలూరు, యల్లాయపాళెం ప్రాంతాల్లో అనధికార పేకాట శిబిరాలను నిర్వహించేవాడు. కానీ ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్లేస్‌లు మార్చేస్తూ మూడు ముక్కలాటతో సొమ్ము చేసుకుంటున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వీడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అక్కడే మద్యం తాగుతూ, డ్యాన్స్‌లు చేస్తూ, పేకాట ఆడుతున్న వీడియో పెద్ద దుమారమే రేపింది.
కమీషన్లతో రూ.లక్షల్లో ఆదాయం
ఈ అనధికార పేకాట శిబిరం నిర్వహణ కోసం పేకాటరాయుళ్లు సదరు టీడీపీ నేతకు 20 శాతం కమీషన్ సమర్పించాలి. ఆటలో కూర్చోవాలంటే ముందుగా రూ.5,000 కట్టాలి. ఆపై పెట్టే ప్రతి రూపాయిలో 20 శాతం ముందుగానే తీసుకుని టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్లు ఉంటేనే ఆడాలి. ఇలా రోజువారీ టీడీపీ నేతకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది.
రోజువారీగా రూ.లక్షలు
చేతులు మారుతున్న వైనం
కొడవలూరు మండల టీడీపీ నేత నిర్వాకం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment