● జీవితంపై విరక్తితో
వృద్ధుడి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన ఎన్.సుధాకర్ (81) కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ నెల్లూరులో చికిత్స చేయించుకుంటున్నాడు. ఆయన బుధవారం చికిత్స నిమిత్తం నెల్లూరుకు వచ్చాడు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మకూరు బస్టాండ్‌లోని మున్సిపల్ మరుగుదొడ్ల సమీపంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు వృద్ధుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించారు. సుధాకర్ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు సురేష్ నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment