
మహిళలకూ సోకిన వ్యసనం
పురుషులకు సమానంగా తామేమి తీసిపోమంటూ మహిళలూ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడడం ఆందోళన కల్గించే విషయం. ఇంటి అవసరాలకు భర్త ఇచ్చిన దాంట్లో మిగుల్చుకుని కొందరు, ఉద్యోగం చేస్తూ వచ్చిన నగదుతో మరికొందరు బెట్టింగ్‌లు కాస్తున్నారు. కొందరు రూ.లక్షల్లో బెట్టింగులు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. బయటకు చెప్పుకోలేక సొంత ఇళ్లలోనే దొంగతనాలు చేస్తున్న వారు కొందరుండగా, బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు లేకపోలేదు. ఇంకొందరు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కోవూరులో ఓ వృద్ధురాలు తన మనవడ్ని ఇంటి ముందు ఆడిస్తుండగా ఇద్దరు మహిళలు స్కూటీపై అక్కడికి వచ్చారు. వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి ఆమె మెడలోని రెండున్నర సవర్ల బంగారు సరుడును తెంపుకెళ్లేందుకు యత్నించారు. వృద్ధురాలు పెద్దగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, స్థానికులు వారిని పట్టుకుని పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. విచారణలో సదరు మహిళలు వైద్యశాఖలో హెల్త్ అసిస్టెంట్‌లనీ, క్రికెట్ బెట్టింగుల్లో రూ.30 లక్షలు అప్పులపాలై దొంగతనానికి యత్నించినట్లు వెల్లడైంది. ఈ విషయం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మహిళలు సైతం బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారంటే జిల్లాలో ఏ స్థాయిలో పందేలు సాగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment