
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
● తొలిరోజు 914 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు శనివారం తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 79 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు 29,102 మంది విద్యార్థులకుగానూ 28,188 మంది హాజరయ్యారు. 914 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ శ్రీనివాసులు స్టోన్‌హౌస్‌పేటలోని నారాయణ, శ్రీచైతన్య, విశ్వసాయి, కృష్ణచైతన్య తదితర పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు బయట పడిగాపులు కాశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్షా కేంద్రాల సమీపంలోని చెట్లు కింద సేద తీరారు. కేంద్రాల వద్ద తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో మంచినీటి కోసం ఇబ్బంది పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment