
బీజేపీ నేతల నిరసన
హౌసింగ్ అధికారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించలేదని బీజేపీ నేత మిడతల రమేష్ అన్నారు. నాయకులు కలెక్టరేట్‌లో నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన పీఎంఏవై గృహాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కొందరు అధికారులు ఫైనల్ బిల్లులు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విజిలెన్స్ విచారణకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపకుండా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో నిధులు విడుదల కావడం లేదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన కందికట్ల రాజేశ్వరి, పొట్లూరు శ్రీనివాసులు, ప్రసాద్, రఘురామయ్య, పద్మ, సుజన, నాగేంద్రసింగ్, ఓజిలి సుధాకర్ నారాయణ యాదవ్, సుబ్బయ్య యాదవ్, కల్లు భాస్కర్, ముజీబ్, వెంకటేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment