యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు: ఓ యువకుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సీహెచ్ అభినవ్‌శర్మ తండ్రి చనిపోవడంతో గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహిస్తుండేవాడు. పాలిటెక్నిక్ ఉత్తీర్ణుడయ్యాక తన తాతకు దేవాలయం పనులు అప్పగించి కార్లు అద్దెకు తిప్పుతున్నాడు. ఈ క్రమంలో దగదర్తి మండలం దుండిగం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి అతడికి పరిచయమాయ్యాడు. అభినవ్ కార్లను శ్రీకాంత్ తీసుకొని తాను హైదరాబాద్ – గుంటూరు మధ్య అద్దెకు తిప్పుతానని నమ్మించాడు. అభినవ్ తన కార్లతోపాటు మరో ఇద్దరి వద్ద నుంచి రెండు కార్లను అద్దెకు తీసుకెళ్లాడు. శ్రీకాంత్ అద్దె చెల్లించకపోగా పరారయ్యాడు. దీంతో అభినవ్‌కు కార్లు అప్పగించిన వారు ఒత్తిడి చేయడంతో అతనే అద్దెలు చెల్లించాడు. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. శ్రీకాంత్ నుంచి సుమారు రూ.19 లక్షల నగదు రావాల్సి ఉండటం, ఇతరుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇంటి వద్ద సూసైడ్ నోట్ రాసి నిద్ర మాత్రలు మింగాడు. అతని తల్లి, తమ్ముడు పరిశీలించి వెంటనే 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై ఎస్‌కే జిలానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment