నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
విద్యార్థులతో పనులు చేయించుకోండి
● అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి శ్రీదేవి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సెలవు రోజుల్లో విద్యార్థుల చేత హాస్టళ్ల గదుల్లోని బూజు, పెట్టెల మధ్యలో ఉన్న చెత్తను తొలగించే పనులు చేయించుకోవాలని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి శ్రీదేవి అన్నారు. నెల్లూరులోని కొండాయపాళెంగేటు సెంటర్‌లో ఉన్న ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం వార్డెన్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ ప్రతి హాస్టల్లో విద్యార్థులతో కమిటీలు వేయాలన్నారు. విద్యార్థులకు కొన్ని బాధ్యతలు అప్పగించి వారి ద్వారా బూజు దులపడం, గదులను శుభ్రం చేయించడం వంటి పనులను చేయించుకోవాలన్నారు. వార్డెన్లు విధిగా స్థానికంగా నివాసం ఉండాలన్నారు. అలా వీలుకాకపోతే హాస్టల్ పనివేళల్లో అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు. లేకపోతే పనివారు కూడా మీ మాట వినరని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. మాన్యువల్ హాజరును పరిగణనలోకి తీసుకోకుండా ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఎంతమంది విద్యార్థులకు పడుతుందో అంతమందికే డైట్ బిల్లులు మంజూరు చేస్తామన్నారు.
మహిళ బలవన్మరణం
బిట్రగుంట: బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలో శాంతమ్మ (50) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చెంచులక్ష్మీపురం గ్రామానికి చెందిన బిజ్జం వెంకారెడ్డి ఇంట్లో ఏడాది నుంచి తిరుపతికి చెందిన శాంతమ్మ అనే మహిళ పనిమనిషిగా ఉంది. ఆమె మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి స్వస్థలం, ఇతర వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో కేసు నమోదు చేసుకుని ఆమె సంబంధీకులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బ్రాయిలర్ (లైవ్) : 119
లేయర్ (లైవ్) : 90
బ్రాయిలర్
చికెన్ : 214
బ్రాయిలర్
స్కిన్‌లెస్ : 236
లేయర్
చికెన్ : 153
నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
Comments
Please login to add a commentAdd a comment