తప్పిపోయిన చిన్నారి
నెల్లూరు(క్రైమ్): ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారిని గంటల వ్యవధిలోనే పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. నెల్లూరులోని ముంగమూరువారి వీధిలో శంకర్‌సింగ్ కుటుంబం నివాసం ఉంటోంది. అతను కనకమహల్ సెంటర్‌లో పవర్ టూల్స్ వ్యాపారం చేస్తున్నాడు. శంకర్ మూడేళ్ల కుమార్తె మాధవి సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాలిక కోసం చుట్టుపక్కల గాలించారు. జాడ తెలియకపోవడంతో చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఈ విషయాన్ని ఎస్పీ జి.కృష్ణకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా గాలించారు. కాపువీధిలో చిన్నారి ఏడుస్తూ ఉండగా వినోద్‌కుమార్ అనే వ్యక్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన చిన్నారి విషయాన్ని సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న చిన్నబజారు పోలీసులకు తెలియజేశారు. వారు చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే కుమార్తెను సురక్షితంగా అప్పగించిన ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, సిబ్బందికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
గంటల వ్యవధిలోనే గుర్తింపు
తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment