
మత్స్యకారులకు అండగా ఉంటాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ముత్తుకూరు: మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీమంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కృష్ణపట్నం పంచాయతీలోని ఆర్కాట్‌పాళెంలో బుధవారం ఆయన పర్యటించారు. మత్స్యకార కుటుంబ పెద్దలతో మాట్లాడారు. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన హామీలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీని చంద్రబాబు ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. మత్స్యకార భరోసా కింద రూ.20 వేలకు ఇస్తానని, డీజిల్‌పై 50 శాతం సబ్సిడీ ఇస్తామని ఓట్లు దండుకుని మొండి చెయ్యి చూపారని గుర్తు చేశారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.4 వేల నుంచి రూ.10వేలకు పెంచి ఇస్తామని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని గుర్తు చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని అందించారని తెలిపారు. ప్రస్తుతం ఏ పథకాలు మత్స్యకారులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక వైఎస్సార్‌సీపీ నేత అక్కయ్యగారి అంకయ్య తల్లి లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబాన్ని కాకాణి పరామర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, స్థానిక ఉపసర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment