
దళారులను నమ్మి మోసపోవద్దు
మనుబోలు: దళారులను నమ్మ మోసపోవద్దని, ప్రభుత్వ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ రైతులకు సూచించారు. మండలంలోని పిడూరులో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. మనుబోలు సచివాలయం–1లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే సకాలంలో తమకు నగదు జమ చేయడం లేదని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ రైతులు అలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. విక్రయించిన ధాన్యానికి సకాలంలో నగదు జమ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు చేర్చేందుకు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. జిల్లాలోని 33 మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో రీసర్వేను మోడల్‌గా నిర్వహిస్తున్నామని తెలిపారు. అది పూర్తయ్యాక లోటు పాట్లను పరిశీలించి అన్ని గ్రామాల్లో రీసర్వేను నిర్వహిస్తామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ సుబ్బయ్య, రీసర్వే డీటీ మంజుల, ఆర్‌ఐ శ్రీకాంత్, ఏఓ షేక్ జహీర్, వీఆర్వో నాగార్జునరెడ్డి తదితరులున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను
సద్వినియోగం చేసుకోండి
కలెక్టర్ ఆనంద్
Comments
Please login to add a commentAdd a comment