
అప్పులతో రాజధాని నిర్మాణం
నెల్లూరు రూరల్: రాష్ట్ర రాజధానిని అప్పులతో నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో మంత్రి తిక్కన ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూ.64 వేల కోట్లతో 5 వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తాం అని తెలిపారు. ఇప్పటికే రూ.50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు. రాజధాని పరిధిలో ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లో నుంచి ఒక్క పైసా కూడా రాజధానికి ఖర్చు చేయమని తెలిపారు. 5 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించామని, రాజధాని నిర్మాణానికి హడ్కో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర బ్యాంక్‌ల నుంచి అప్పు తీసుకుని నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. 1000 నుంచి 1200 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు, పాఠశాలలు, సంస్థలకు కేటాయించామన్నారు. బడ్జెట్‌లో రాజధానికి రూ.6 వేల కోట్లు కేటాయించాం. అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని సీఎం చెప్పారన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment