
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
● ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
కందుకూరు రూరల్: కందుకూరు నుంచి ఒంగోలు వెళ్తున్న కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికుల కథనం మేరకు.. గురువారం ఓవీ రోడ్డులో బస్సు వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో 167బీ జాతీయ రహదారి మూడు రోడ్ల కూడలి వద్ద డ్రైవర్ స్పీడ్ బ్రేకర్‌ను తప్పించబోయాడు. దీంతో వాహనం సైడుకు వెళ్లింది. ఈ సమయంలో కంట్రోల్ తప్పి హైవే మార్జిన్‌లోకి వెళ్లింది. టైర్లు అక్కడ కొత్తగా పోసిన మట్టిలోకి దిగాయి. అంతే కాకుండా పెద్ద రాళ్లు ఉండటంతో బస్సు అదుపు తప్పకుండా ఆగిపోయింది. అప్పటికే అందులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బోల్తా పడకుండా నిలిచిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్పీడ్ బ్రేకర్ వద్ద వేగం తగ్గించి బస్సును సైడుకు తిప్పకుండా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని ప్రయాణికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment