
నష్టపరిహారం ఇవ్వలేదని..
● నూతన రోడ్డును ధ్వంసం చేసిన రైతులు
ఆత్మకూరు: నష్టపరిహారం చెల్లించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వేస్తున్న రోడ్డును ట్రాక్టర్‌తో ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండలంలోని రామస్వామిపల్లి నుంచి గండ్లవేడు వరకు కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గ్రామంలో సర్వే నంబర్లు 189, 190ల్లో పక్కా పట్టా భూమిలో రోడ్డు నిర్మాణం గురించి తమకు తెలపకపోవడం, నష్టపరిహారం ఇవ్వలేదని కోపగించుకున్న రైతులు ట్రాక్టర్ ద్వారా గురువారం రోడ్డును ధ్వంసం చేశారు. దీనిపై కాంట్రాక్టర్, అధికారులను ప్రశ్నించారు. కాగా ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment