
మహిళల భద్రతకు పెద్దపీట
నెల్లూరు(క్రైమ్): మహిళల భద్రతకు పోలీస్ శాఖ పెద్దపీట వేసినట్లుగా ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఐసీడీఎస్ పీడీ సుశీలాదేవీలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కేవీఆర్ పెట్రోల్ బంకు కూడలిలో విద్యార్థినులు నృత్యాలు చేస్తూ మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. తొలుత ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మహిళల గౌరవాన్ని పెంపొందించే విధంగా పోలీసు అధికారులు పలు చిత్రాలను ప్రదర్శించారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు ఎస్పీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మునిరాజా, నగర డీఎస్పీ పి.సింధుప్రియ, డీసీపీఓ సురేష్, సీడీపీఓలు లక్ష్మీదేవి, అనురాధ, డీటీసీ ఇన్‌స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఆర్‌ఐలు అంకమరావు, రాజారావు, అధ్యాపకురాలు లేపాక్షి, పలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment