
పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: పీఎంశ్రీ పథకం ద్వారా జిల్లాలో ఎంపికైన పాఠశాలలకు మంజూరైన నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో 42 పాఠశాలల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. కెమిస్ట్రీ, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, లైబ్రరీలు, కిచెన్ షెడ్స్, మరుగుదొడ్ల నిర్మాణం తదితర వాటికి రూ.5.33 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. స్కూళ్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. ఉపాధి పథకం ద్వారా బడుల్లో ప్లాంటేషన్, సీసీ రోడ్లు మంజూరు చేస్తామని చెప్పారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఈఈ సుబ్బరాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment