
నేడు మహిళా దినోత్సవం
లక్ష్యం దిశగా శ్రమించాలి
నెల్లూరు(క్రైమ్): యువతకు లక్ష్యం ఉండాలి. పట్టుదలతో పాటు సరైన ప్రణాళికతో కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మా ఊరు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వీరారెడ్డిపల్లి. తండ్రి పి.లింగారెడ్డి ఉపాధ్యాయుడు కాగా, తల్లి వనజాక్షి గృహిణి. బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఏడాది పాటు సివిల్ ఇంజినీర్‌గా పనిచేశాను. సివిల్స్, ఏపీపీఎస్పీ పరీక్షలు రాసి ఉన్నత ఉద్యోగం సాధించాలని ఉస్మానియా లో ఎంఏ సోషియాలజీ పూర్తి చేశాను. 2018లో సీ్త్ర,శిశు సంక్షేమశాఖలో సీడీపీఓగా సూర్యాపేట లో బాధ్యతలు చేపట్టాను. మహిళా కమిషన్‌లో విధులు నిర్వహిస్తుండగా 2022లో ఏపీఎస్పీ రాసి డీఎస్పీగా ఎంపికయ్యాను.
– పి. సింధుప్రియ, నగర డీఎస్పీ

నేడు మహిళా దినోత్సవం

నేడు మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment