వింజమూరు(ఉదయగిరి): ఆశయం ఉంటే.. ఏదైనా సాధించడం కష్టం కాదు. చిన్న తనం నుంచి క్రీడలంటే ఎంతో ప్రేమ. ఆ మక్కువే తనను వ్యాయామ ఉపాధ్యాయ వృత్తి వైపు నడిపించింది. 2009లో పీఈటీగా ఉద్యోగం పొంది కాటేపల్లి, వింజమూరు ఉన్నత పాఠశాలల్లో పని చేస్తూ మాస్టర్ అథ్లెటిక్స్ వెటరన్ పోటీల్లో జాతీయ స్థాయిలో ఎన్నో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించాను. 2019లో ఇంటర్ నేషనల్ స్థాయి (సింగపూర్) ఆటలో పాల్గొనే అవకాశం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులతో వెళ్లలేకపోయాను. 2019 నుంచి 2024 వరకు వరసగా వెటరన్ (35–40 ఇయర్స్ ఏజ్ గ్రూపు విభాగం)లో పతకాలు సాధిస్తున్నారు. ఇటీవల కాకినాడలో రాష్ట్ర స్థాయిలో పీడీలకు జరిగిన పోటీల్లో లాంగ్‌జంప్, వాకింగ్, 100 మీ. పరుగు పందెంలో గోల్డ్ మెడల్స్ సాధించాను.
– గంగమాల విలాసిని,
వింజమూరు బాలికల హైస్కూల్ పీడీ
Comments
Please login to add a commentAdd a comment