నెల్లూరు(క్రైమ్): విద్యే మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ ఖలీల్‌బాషా, ఖాజాబీ దంపతుల కుమార్తెను. డిగ్రీ వరకు మైదుకూరులో చదువుకుని, తిరుపతిలో ఎంబీఏ పూర్తి చేశాను. నా తల్లిదండ్రుల కుటుంబాల్లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కష్టపడి చదివాను. 2018లో గ్రూప్–1లో రాణించి ఎకై ్సజ్ శాఖలో ఏఈఎస్‌గా బాధ్యతలు చేపట్టాను. ఏలూరులో బాధ్యతలు చేపట్టిన అనంతరం అంచెలంచెలుగా పదోన్నతి పొంది ప్రస్తుతం నెల్లూరు ఐఎంఎల్ డిపోలో విధులు నిర్వహిస్తున్నాను. విద్యతోనే ఉన్నతి లభిస్తుంది. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న చోట మహిళలు అన్ని రంగాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నారు.
– ఆయేషాబేగం, ఐఎంఎల్ డిపో మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment