
రిసెప్షన్‌కు వెళ్లొస్తూ అనంతలోకాలకు
నెల్లూరు పరిధిలోని జాతీయ రహదారి శనివారం రక్తసిక్తమైంది. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడగా, పది మంది గాయపడ్డారు. ఈ ఘటనలు ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని
నింపాయి.
– నెల్లూరు(క్రైమ్)
నుజ్జునుజ్జయిన ఆటో
● వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
● మృతులు విడవలూరు, ముత్తుకూరు,
సూర్యాపేట వాసులు
● పది మందికి గాయాలు
విడవలూరు మండలం మన్మథరావుపేటకు చెందిన ఆయోధ్య రామయ్య(55) బంధువులకు అదే ప్రాంతంలో ఇటీవల వివాహమైంది. ఈ క్రమంలో నెల్లూరులోని అంబాపురంలో రిసెప్షన్‌ను శుక్రవారం నిర్వహించారు. దీంతో ఆయోధ్య రామయ్య, తన బంధువులైన కామాక్షినగర్‌కు చెందిన శ్రీరాములు (74), అల్లూరు మండలం యర్రపుగుంటకు చెందిన శ్రీనివాసులు, పద్మ దంపతులు, కుమారుడు మధుసూదన్, విడవలూరు మండలం పటేల్‌నగర్‌కు చెందిన నరసింహులు, రాజేశ్వరి దంపతులు, బంధువు భవానితో కలిసి తన ఆటోలో అంబాపురానికి వెళ్లారు. అనంతరం విడవలూరుకు అర్ధరాత్రి బయల్దేరారు. సుందరయ్య కాలనీ సమీపంలోని మలుపు వద్ద చైన్నె వైపు నుంచి విజయవాడ వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. ఆటో బోల్తాపడటంతో ఆయోధ్య రామయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన వారు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సాయంతో నగరంలోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీరాములు శనివారం మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మధుసూదన్, నరసింహులును మెరుగైన చికిత్స నిమిత్తం చైన్నె తరలించారు. నగరంలోని జీజీహెచ్‌లో శ్రీనివాసులు, పద్మ, రాజేశ్వరి, భవాని చికిత్స పొందుతున్నారు. మధుఽసూదన్ ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు.

రిసెప్షన్‌కు వెళ్లొస్తూ అనంతలోకాలకు

రిసెప్షన్‌కు వెళ్లొస్తూ అనంతలోకాలకు
Comments
Please login to add a commentAdd a comment