
కారు అదుపుతప్పి మహిళ దుర్మరణం
● ముగ్గురికి గాయాలు
మర్రిపాడు: కారు అదుపుతప్పి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఢీకొనడంతో మహిళ మృతి చెందగా, ముగ్గురు గాయపడిన ఘటన మండలంలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై కండ్రిక సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఆత్మకూరు నుంచి మర్రిపాడుకు వెళ్తున్న కారు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన పల్లవోలుకు చెందిన సుజాతమ్మ (55)ను మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరుకు తరలిస్తుండగా వాశిలి సమీపంలో మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటన స్థలాన్ని ఎస్సై శ్రీనివాసరావు, ఎమ్వీఐ రాములు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
బైక్ ఢీకొని
మహిళకు గాయాలు
పొదలకూరు: బైక్ ఢీకొనడంతో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణంలోని మనుబోలు రోడ్డు నిమ్మ మార్కెట్ యార్డు వద్ద శనివారం చోటుచేసుకుంది. ఎస్సై హనీఫ్ వివరాల మేరకు.. నిమ్మ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన జయంతిశక్తి రోడ్డుపై వెళ్లసాగారు. ఈ క్రమంలో సైదాపురం మండలం దేవరవేమూరుకు చెందిన శంకరయ్య మద్యం మత్తులో బైక్‌ను నడుపుతూ ఆమెను ఢీకొన్నారు. క్షతగాత్రురాలిని 108లో ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment