
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహ్మద్ ఫరూక్
● కస్తూర్బాలో ఘనంగా మహిళా దినోత్సవం
నెల్లూరు(అర్బన్): మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహ్మద్ ఫరూక్ అన్నారు. శనివారం నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత సెల్ఫీ బూత్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు సంక్షేమ పథకాలతో పాటు సబ్సిడీ రుణాలు, స్వయం ఉపాధి పథకాలు అందిస్తున్నామన్నారు.
మహిళలకు రూ.440 కోట్ల రుణాలు
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు రకాల పథకాల ద్వారా రూ.440 కోట్ల మేర రుణాల పంపిణీకి సంబంధించి మంత్రి మహ్మద్ ఫరూక్, కలెక్టర్ ఆనంద్ మెగా చెక్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ణకాంత్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ట్రైకార్ డైరెక్టర్ అనూరాధ, డీఆర్‌డీఏ, మెప్మా, ఐసీడీఎస్ శాఖల పీడీలు నాగరాజకుమారి, రాధమ్మ, సుశీల, డీఎంహెచ్‌ఓ సుజాత, పరిశ్రమల శాఖ జీఎం మారుతీప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్‌కుమార్, హ్యాండ్లూమ్స్ ఏడీ వరప్రసాద్, పలువురు జిల్లా అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment