
లోక్ అదాలత్‌లో 32,848 కేసుల పరిష్కారం
● రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మొదటి స్థానం
నెల్లూరు (లీగల్) ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 32,848 కేసులు పరిష్కరించి, రూ.2,64,53,501 చెల్లింపులు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని ఆరో జిల్లా కోర్టు హాల్‌లో న్యాయమూర్తి కె. వెంకటనాగపవన్‌కుమార్ జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. నెల్లూరు నగరంలో కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా 5 బెంచ్‌లను ఏర్పాటు చేసి న్యాయమూర్తులు కె. వెంకటనాగపవన్, ఎస్. శ్రీనివాస్, గోరంట్ల స్వాతి, ఎల్.శారదరెడ్డి, ఎన్.లావణ్య, ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి 14,208 కేసులు పరిష్కరించారు. జిల్లాలోని వివిధ కోర్టుల్లో లోక్‌అదాలత్ జరిగింది. గూడూరు 341, కోవూరు 3,976, కావలి 2,615, వెంకటగిరి 2,601, కోట 300, నాయుడుపేట 55, సూళ్లూరుపేట 1,164, ఆత్మకూరు 2,168, ఉదయగిరి 1,550 కేసులు పరిష్కరించారు. సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి, పలువురు న్యాయమూర్తులు, పోలీసు, బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment