
తెలుగు తమ్ముళ్ల అధికార గర్వం
తోటపల్లిగూడూరు: అధికారంలో ఉన్నామని తెలుగు తమ్ముళ్తు రెచ్చిపోతున్నారు. సోమవారం ఓ స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం సృష్టించారు. వివరాలు.. చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం సరస్వతి పూజ, పాఠశాల వార్షికోత్సవం జరిగింది. పూజ అనంతరం మధ్యాహ్నం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కోడూరు పంచాయతీ వెంకటేశ్వరపట్టపుపాళెం, ముత్యాలతోపు పట్టపుపాళెం గ్రామాల్లోని టీడీపీకి చెందిన యువకులు మద్యం తాగి స్కూల్‌కు చేరుకుని విద్యార్థులు నృత్యాలు చేస్తుండగా కేకలు, అరుపులతో గంతులేశారు. తాము కోరిన పాటలు పెట్టాలంటూ ఆర్కెస్ట్రా నిర్వాహకులతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేశారు. ఇదేంటని అడిగిన సౌండ్ సిస్టం ఆపరేటర్‌పై దాడికి దిగారు. టీచర్లు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న యువకులు ఓ టీచర్‌పై దాడి చేసి అతడి సెల్‌ఫోన్‌ను పగులగొట్టారు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు, టీచర్లు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై హెచ్‌ఎం సాయిప్రసాద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మద్యం తాగొచ్చి స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం
టీచర్, మరో వ్యక్తిపై దాడి
Comments
Please login to add a commentAdd a comment