
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్): దంపతుల నడుమ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కిసాన్‌నగర్‌లో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కిసాన్‌నగర్‌కు చెందిన వెంకటరమణ, కృష్ణవేణి (35) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటరమణ కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దంపతుల నడుమ మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. శనివారం ఇద్దరికి గొడవ జరిగింది. వెంకటరమణ ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఫ్యాన్ హుక్కుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చిన భర్త తలుపు తీసే ప్రయత్నం చేయగా రాలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపు పగుల గొట్టి చూడగా భార్య ఉరేసుకుని ఉండడంతో ఆమెను కిందకు దించి చికిత్స నిమిత్తం నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటరమణ ఈ విషయాన్ని తోటపల్లిగూడూరులో ఉంటున్న అత్త (మృతురాలి తల్లి) నరసమ్మ, కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు హాస్పిటల్‌కు చేరుకుని కృష్ణవేణి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. నరసమ్మ నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్ అన్వర్‌బాషా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు.