
ముగిసిన బ్రహ్మోత్సవాలు
నెల్లూరు(బృందావనం) : చైత్రమాసం సందర్భంగా నగరంలోని వివిధ ఆలయాల్లో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో పరిసమాప్తమయ్యాయి.
● ఉస్మాన్‌సాహెబ్‌పేటలోని కోదండరాముని దేవస్థానంలో స్వామివారికి గురువారం రాత్రి పుష్పయాగం నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణ, ఏకాంతసేవ జరిపించారు. ఉభయకర్తలుగా సరాబు హజరత్తయ్య– జానకి, పేరేపు గోపాలకృష్ణమూర్తి– లలిత, సంతోష్‌కుమార్– మధురిక దంపతులు, కుటుంబసభ్యులు వ్యవహరించారు. ఈఓ జి.దర్గయ్య పర్యవేక్షించారు.
● మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉదయం చక్రస్నానం, రాత్రి ఏకాంతసేవ వేడుకగా నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, పాలకమండలి చైర్మన్ మజ్జిగ చంద్రమౌళిరెడ్డి, ఈఓ జంజం శ్రీనివాసరావు పాల్గొని పర్యవేక్షించారు.
● నవాబుపేటలోని భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఏకాంతసేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉభయకర్తలుగా గుండ్లపల్లి అరవింద్‌కుమార్ వ్యవహరించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈఓ బి.మల్లికార్జునరెడ్డి పాల్గొని పర్యవేక్షించారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ముగిసిన బ్రహ్మోత్సవాలు