
జగనన్న లేఅవుట్ల ఆక్రమణకు యత్నం
జలదంకి: మండలంలోని రామవరప్పాడులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్లను ఆక్రమించేందుకు ఆ గ్రామానికి చెందిన ఓ చోటా టీడీపీ నేత ప్రయత్నాలు ప్రారంభించాడు. నాలుగు రోజులుగా లేఅవుట్ల స్థలాల హద్దురాళ్లను తొలగించారు. అక్కడ నివేశన స్థలాల అభివృద్ధి పనులకు సంబంధించి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల ఆ లేఅవుట్లో పెరిగిన చిల్లచెట్లను సైతం నరికేసి సుమారు రూ.3 లక్షల మేర సొమ్ము చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా, పంచాయతీ అధికారులు సైతం మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2.3 ఎకరాల విస్తీర్ణంలో 64 మంది నిరుపేదలకు నివేశన స్థలాలు మంజూరు చేసి, ఇంటి పట్టాలను అందజేసింది. ఆ స్థలాలను దౌర్జన్యపూరితంగా ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.
వీఆర్‌కు కలువాయి ఎస్‌ఐ
నెల్లూరు (క్రైమ్): విధుల్లో నిర్లక్ష్యం, పలు కారణాల నేపథ్యంలో కలువాయి ఎస్‌ఐ సుమన్‌ను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ జి. కృష్ణకాంత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ఫీజు గడువు పెంపు విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలన్నారు.
అదనపు కమిషనర్‌కు
ఎఫ్‌ఏసీ బాధ్యతలు
నెల్లూరు (బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా ఉన్న వైఓ నందన్‌ను ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించిన ప్రభుత్వం, తాజాగా పూర్తి అదనపు బాధ్యతలతో కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో నందన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

జగనన్న లేఅవుట్ల ఆక్రమణకు యత్నం