తూతూమంత్రంగా శిక్షణ | - | Sakshi
Sakshi News home page

తూతూమంత్రంగా శిక్షణ

Published Tue, Apr 29 2025 12:04 AM | Last Updated on Tue, Apr 29 2025 12:04 AM

తూతూమంత్రంగా శిక్షణ

తూతూమంత్రంగా శిక్షణ

దుత్తలూరు: ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులకు చేపట్టిన శిక్షణ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో తూతూమంత్రంగా జరుగుతోంది. దుత్తలూరు మోడల్‌ పాఠశాలలో మొదటి సంవత్సరంలో 51 మంది, ద్వితీయ సంవత్సరంలో 24 మంది ఫెయిలయ్యారు. వీరిని పాఠశాలలకు రప్పించి ఫెయిలైన సబ్జెక్ట్‌ల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శిక్షణ ఇవ్వాలి. సోమవారం పాఠశాలకు ఒక్క విద్యార్థిని మాత్రమే హాజరైంది. టీచర్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ కనిపించారు. కొద్దిరోజులుగా మొక్కుబడిగా ఈ శిక్షణ కొనసాగుతోందని విమర్శలున్నాయి. ఈ విషయమై ప్రిన్సిపల్‌ సైమన్‌రావును వివరణ కోరగా ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం వస్తున్నారని, ఎండలకు విద్యార్థులు రావడం లేదని, ఇందుకు తామేమి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement