‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: పదో తరగతి పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విజయవాడ నుంచి కలెక్టర్లు, జేసీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, పీ–4 మోడల్ సర్వే, స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చేతన్ జిల్లా అధికారులతో మాట్లాడారు. మార్చి 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షల ఏర్పాట్లలో లోపాలు ఉండకూడదన్నారు. పీ–4 సర్వే పక్కాగా చేసి నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. మార్చి 15న చేపట్టే స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
232 మంది విద్యార్థుల గైర్హాజరు
పుట్టపర్తి: ఇంటర్ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఫిజిక్స్/ ఎకనామిక్స్ పేపర్–2 పరీక్షలకు జిల్లాలో 232 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 9,329 మందికి గాను 9,134 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 1,147 మందికి గాను 1,110 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రఘునాథరెడ్డి, జిల్లా స్పెషలాఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, కమిటీ సభ్యులు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment