ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం
బత్తలపల్లి: ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహిద్దామని సెర్ప్ ఏసీ సత్యనారాయణ, ఏపీఎం సుదర్శన్‌రాజు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రమైన బత్తలపల్లిలోనూ, రాఘవంపల్లిలోనూ ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామన్నారు. అంతకు ముందు బత్తలపల్లిలో కాశప్ప పొలంలో ఏటీఎం మోడల్ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులతో వేయించారు. ఈ విధానంలో రోజూ ఆదాయం పొందుతున్న పార్వతి, గంగమ్మ, నారాయణమ్మ ద్వారా తెలుసుకున్నారు. రాఘవంపల్లిలో శివప్రసాద్ చీనీ పీఎండీఎస్‌లో ఆరు రకాల ప్రధాన పంటలు ఆముదం, కంది, సజ్జ, అనుములు, అలసంద, గోరుచిక్కుడు, 23 రకాల జీవ వైవిధ్య పంటల విత్తనాలు, బీజామృతంతో విత్తనశుద్ధి చేసి, ఘన జీవామృతం పైడర్‌తో పాటు కలిపి విత్తినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌పీఓ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మండల సమాఖ్య లీడర్లు, సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment